Monday 24 October 2011

మల్టీ స్టారర్ కాదు మల్టీమల్లీస్టారర్ .. 3డి మూవీ..!


రెండు భారీ సినిమాలు నువ్వా నేనా అన్నట్టు బాక్సాఫీస్ బరిలోకి దూకినప్పుడు వాటితో ఏమాత్రం సరితూగలేని చిన్న చిత్రాలు సైద్ అయిపోవడమే ఉత్తమం. కాదని రెండింటి మధ్య దూకితే గల్లంతవ్వడం తద్యం. అల్లరి నరేష్ నటించిన మడతకాజా సినిమా విషయంలో అదే జరిగింది. ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరోగా ముద్ర పడ్డ అల్లరి నరేష్ సినిమాలకి ప్రేక్షకులనుంచి ఎప్పుడూ మంచి స్పందన వస్తున్నా కానీ ఈసారి అతడి ‘మడతకాజా’కి చేదు అనుభవమే మిగిల్చింది. కాగా అల్లరి నరేష్ మరో చిత్రానికి కమిట్ అయ్యారు.

బిందాస్, అహానా పెళ్ళంట వంటి హిట్ చిత్రాల్ని నిర్మించిన ఎకె ఎంటర్ టైన్మెంట్స్ అధినేత, ఇండస్ట్రీ హిట్ ‘దూకుడు’ నిర్మాతల్లో ఒకరైన అనీల్ సుంకర ఈసారి నలుగురు హీరోలతో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ నలుగురిలో లీడ్ రోల్ ని అల్లరి నరేష్ పోషిస్తుండగా మరో ముగ్గురు హీరోల ఎంపిక జరుగుతోంది.

తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి హైబడ్జెట్ లో సోషల్ 3డి మూవీగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 2012 వేసవిసెలవులకు విడుదల చేయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ అయింది. ఎకె ఎంటర్టైన్మెంట్ హ్యాట్రిక్ మూవీగా ఈ సోషల్ 3డి చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment