Saturday 22 October 2011

'డర్టీ పిక్చర్స్'విద్యకు సిద్దార్థ్ వార్నింగ్!!


తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న క్లబ్ డ్యాన్సర్ దివంగత సిల్క్‌‍స్మిత జీవిత కథను ఆధారంగా చేసుకుని నిర్మిస్తున్న చిత్రం డర్టీ పిక్చర్స్. ఈ చిత్రంలో సిల్క్‌ పాత్రను బాలీవుడ్ ముద్దుగుమ్మ విద్యాబాలన్ పోషిస్తోంది. అయితే, చిత్రంలో విద్యాబాలన్ చేసిన ఎక్స్‌పోజింగ్‌పై బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో పెద్ద చర్చే సాగుతోంది. ఈ చర్చ విద్యాబాలన్ ప్రియుడు సిద్దార్థ్ రాయ్‌ చెవిన పడిందట. తన ప్రియరాలు ఒక సినిమా కోసం హాట్‌హాట్‌గా ఎక్స్‌పోజింగ్ చేయడాన్ని జీర్ణించుకోలేక పోయాడట. దీంతో విద్యాబాలన్‌ను పిలిచిగట్టిగా మందలించినట్టు సమాచారం. ఒక సినిమాలో పాత్ర కోసం అందచందాలను బరితెగించి ప్రదర్శించడమా అంటూ మండిపడినట్టు వినికిడి. మొత్తంమ్మీద డర్టీ పిక్చర్స్ చిత్రంలో విద్యాబాలన్ ఎక్స్‌పోజింగ్‌పై ఇపుడు చిత్ర పరిశ్రమలో రచ్చరచ్చగా వుంది.

No comments:

Post a Comment