Saturday 22 October 2011

రజనీకాంత్ ని అడ్డం పెట్టుకుని షారూఖ్ పై సెటైర్స్


బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తాజా చిత్రం రా వన్ లో రజనీకాంత్ కేవలం ఒక నిముషం కనపడే గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ...రా వన్ చిత్రం షారూఖ్ రెండున్నర గంటలు పాటు గెస్ట్ గా చేసిన రావన్ చిత్రం..రజనీకాంత్ కి ఒక నిముషపు షార్ట్ పిలిం అని వ్యాఖ్యానించారు. రజనీకాంత్ ని అడ్డం పెట్టుకుని సూపర్ స్టార్ షారూఖ్ కి ఆయన సెటైర్స్ వేసారు.అంటే రజనీకాంత్ గొప్పవాడని..ఆయన చేసే నిముషం గురించే జనం వెల్తారని,షారూఖ్ చేసిన పాత్ర గెస్ట్ గా మిగిలిపోతుందని దాని అర్దం. రా వన్ లో రజనీ గెస్ట్ గా రోబో చిట్టి గా కనిపించి అలరించనున్నారు. ఈ విషయాన్ని షారూఖ్ ఖాన్ కన్ఫర్మ్ చేస్తూ మీడియాతో మాట్లాడుతూ...అవును..రజనీకాంత్ మరోసారి చిట్టి అవతారంలో మా చిత్రంలో కనిపిస్తున్నారు. ఆయన ముంబై వచ్చి షూటింగ్ లో పాల్గొ న్నారు.ఆయనతో పనిచేయటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమాలో అదో పన్ని సీన్. కరీనాకపూర్ కొడుకుని జి వన్ గా నేను రక్షించటానికి గూండాలతో ఫైట్ చేస్తూంటే హటాత్తుగా చిట్టి అక్కడ ప్రత్యక్ష్యమవుతాడు.అప్పుడు నేను కరీనాని ఎవరితను అని అడుగుతాను.ఆమె రెస్పాండ్ కాదు. అదో ఇంట్రస్టింగ్ ఎపిసోడ్ అన్నారు.

No comments:

Post a Comment