రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో
ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటారు. తాజాగా షారుక్ ఖాన్ నటించిన రావన్ చిత్రం
గురించి మాట్లాడుతూ... డైరెక్టర్ ప్రతిభ అని అందరూ అంటారు. కానీ ఎంత మంచి
సబ్జెక్టయినా ఊరూపేరూ లేని ఓ కొత్త హీరోతో ఓ పెద్ద డైరెక్టర్ సినిమా తీస్తే
ఆడుతుందా..? ఛస్తే ఆడదు.ఎందుకంటే
ఇక్కడ హీరోదో మెయిన్ రోల్. ఫలానా హీరో సినిమా అంటే జనం పరుగెత్తుకుంటా
వస్తారు. అది చెత్త సబ్జెక్టయినా ముందు డబ్బులొచ్చేస్తాయ్.
డిస్ట్రిబ్యూటర్లుకు బాధండదు. అదే
సూపర్ కథతో ఓ కొత్త హీరోని తీసుకుని సినిమా తీస్తే ప్రేక్షకులు ఆ సినిమా
ముఖం కూడా చూడరని వర్మ అభిప్రాయపడ్డారట. వర్మ విశ్లేషణలో నిజం నూటికి
నూరుపాళ్లు ఉందని బాలీవుడ్ సినీజనం అంటున్నారు. ఎంతైనా వర్మ ది గ్రేట్.
No comments:
Post a Comment