చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య చాలా కాలంగా సాగుతున్న యుద్దానికి విరమణ
జరిగినట్లే అని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఇద్దరి మధ్య ఓ పెద్ద నిర్మాత
మధ్యవర్తిత్వం చేసి రాజీ కుదుర్చాడని చెప్పుకుంటున్నారు.పాలిటిక్స్
లోనూ,సినీ పరిశ్రమలోనూ శాశ్వత మిత్రులు కాని,శాశ్వత శత్రువులు గానీ ఉండరని ఈ
సంఘటనతో నిరూపించినట్లు అవుతోంది.ఇక ఈ రాజీ కుదిరాకే దిల్ రాజు
నిర్మించనున్న చిత్రంలో రాజశేఖర్ విలన్ గా నెగిటివ్ రోల్ చేయటానికి ఓకే
చేసాడని చెప్తున్నారు.వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రూపొందే ఈ చిత్రం
త్వరలోనే ప్రారంభం కానుంది. రామ్చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్
అని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.
No comments:
Post a Comment