Saturday, 22 October 2011

ఇలియానాను చూస్తుంటే..!ఫరాఖాన్


నటన పట్ల ఆమెకున్న డెడికేషన్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఎంత కష్టమైన స్టెప్పులను చూపించినా వాటిని అవలీలగా చేసేస్తోంది. ఆమెకు డ్యాన్స్ కంపోజ్ చేయడం చాలా సులభం.డ్యాన్స్ కంపోజింగ్‌లో ఎంత బాగా సహకరిస్తుందో..నిజంగా ఇలియనాను మెచ్చుకోవాలి అంటోంది ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్.ఆ మధ్య గోవా బ్యూటీ ఇలియానా ఆ మధ్య షూటింగ్‌లో గాయపడి ఆసుపత్రిపాలైంది. దీంతో కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుని మళ్ళీ 'నన్బన్' షూటింగ్‌లో పాల్గొంది. ఫరాఖాన్ ఈ చిత్రంలోని పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేస్తోంది. ఓ పాటకు నృత్యం చేస్తున్నప్పుడే ఇలియానా కాలుకి ఫ్రాక్చర్ అయింది. దీనిపై ఫరాఖాన్ ఇలా స్పందించింది. అలాగే ఇలియానా కాలుకి ఫ్రాక్చర్ అయినా ఏమాత్రం లెక్కచేయలేదు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకొని వెంటనే షూటింగ్‌లో జాయిన్ అయిపోయింది అంది. ప్రస్తుతం ఇలియానాకు తెలుగులో ఆఫర్స్ ఏమి లేవు. నేనూ నా రాక్షసి,శక్తి ప్లాపులతో ఆమె వైపు చూసే వారే కరువయ్యారు. దాంతో ఇప్పుడు ఇలియానా దృష్టంతా ఈ చిత్రం మీదే. ఎందుకంటే రోబో శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంతోనైనా తన పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలని ఈ గోవా భామ భావిస్తోంది.

No comments:

Post a Comment