Monday, 24 October 2011

నాగార్జునకు థర్టీప్లస్‌,నాగచైతన్య కు ట్వంటీప్లస్‌


అక్కినేని కుటుంబంతో 75 సంవత్సరాల తెలుగు ఇండస్ట్రీకి అవనాభావ సంబంధం ముడిపడిపోయింది. ఇప్పటికే నాగేశ్వరరావు, నాగార్జున నటనలో ఎంతో పరిపక్వత సాధించి ఎవరూ అధిరోహించని శిఖరాలను చేరుకున్నారు. ఇప్పుడు వారి కుటుంబంలో మూడోతరం హీరోగా రంగప్రవేశం చేసిన నాగచైతన్య కూడా మూడో చిత్రం ‘100 % లవ్‌’తో నటుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. తొలి మూడు చిత్రాలలోనూ వైవిధ్యభరిత నటనను చూపి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. త్వరలో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో మాస్‌ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. నాగార్జున కూడా తన కెరీర్‌ మొదట్లో ప్రేమ చిత్రాలలో నటించి ‘శివ’ చిత్రం ద్వారా యాక్షన్‌ చిత్రాలకు శ్రీకారం చుట్టారు. అయితే నాగార్జున ఇప్పటికీ కుర్రహీరోలతో పోటీపడుతూ సంవత్సరానికి రెండు లేక మూడు చిత్రాలలో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కాకపోతే వయసు ఫిఫ్టీ రీత్యా ఇప్పుడు థర్టీ ప్లస్‌ హీరోయిన్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

అలానే నాగచైతన్య ట్వంటీప్లస్‌ హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేయాల్సివస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో అంతా కొత్త హీరోయిన్లు ట్వంటీప్లస్‌లే ఎక్కువగా ఉండటంతో మరి వీరంతా నాగచైతన్య లిస్ట్‌లో చేరిపోతున్నారు. అప్పుడు నాగార్జునకు హీరోయిన్ల కొరత తప్పదేమో అనిపిస్తోంది. ఇప్పటికే థర్టీప్లస్‌ హీరోయిన్లు అయిన త్రిష, నయనతార, ప్రియమణిలతో జతకట్టిన నాగార్జున కొడుకు పక్కన హీరోయిన్లుగా నటించిన సమంత, తమన్నా, నటించబోయే కాజల్‌, తాప్సీ వంటి తారలతో మరి జతకడతారా? ఒకవేళ కడితే ప్రేక్షకులు ఎంతమేరకు హర్షిస్తారు...లాంటి ప్రశ్నలు సంధించుకుంటే వాటికి సమాధానం దొరకడం కష్టమే. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు పక్కన హీరోయిన్‌గా చేసిన శ్రీదేవి పక్కన నాగార్జున హీరోగా ‘ఆఖరిపోరాటం’ సినిమాలో చేశారు. ఆ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. కాకపోతే ఇప్పుడు మారిన ట్రెండ్‌కు అనుగుణంగా ఒక వేళ...నాగార్జున, నాగ చైతన్య ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేయాల్సి వస్తే ఇటువంటివి తెలుగు ప్రేక్షకులు ఆమోదిస్తారో లేదో వేచిచూడాలి.

No comments:

Post a Comment